News March 4, 2025
మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 9, 2026
హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.
News January 9, 2026
జనవరి 09: చరిత్రలో ఈరోజు

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం
News January 9, 2026
సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ

సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, గజ్వేల్ రూరల్ సీఐ పింగళి మహేందర్ రెడ్డి, చేర్యాల సీఐ శ్రీనును బదిలీ చేయగా, రైల్వేస్లో పని చేస్తున్న లక్ష్మీబాబు సిద్దిపేట త్రీటౌన్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేయగా, దండుగుల రవి రాజును గజ్వేల్ రూరల్ సీఐ, బానోతు రమేష్ను చేర్యాల సీఐగా బదిలీ చేశారు.


