News March 4, 2025
మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 24, 2025
తాజంగి: అంగన్వాడీ గ్రేడ్-1 సూపర్వైజర్ మృతి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీలో గల వంతమామిడి గ్రామానికి చెందిన సి హెచ్ సత్యవతి అంగన్వాడీ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు. పోషణ్ భీ పడాయి భీ శిక్షణలో భాగంగా శనివారం శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా స్పృహా తప్పడంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన చింతపల్లి సీహెచ్చికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో నర్సీపట్నం హాస్పిటల్ నుంచి విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
News March 24, 2025
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. మండలంలోని ముష్టిబండ శివారులో తెల్లవారుజామున లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగాలాండ్‌కి చెందిన ఆశిష్ పాలె మృతి చెందాడు. అశ్వారావుపేట మం. నారంవారిగూడెం బంధువుల ఇంటికి వెళ్తుండగా గాంధీనగర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సరస్వతి, కృష్ణ అనే తల్లికొడుకులు మృతి చెందారు.
News March 24, 2025
MNCL: మహాప్రస్థానంపై పొలిటికల్ వార్

మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయాలు మహాప్రస్థానం(గోదావరి తీరంలో వైకుంఠధామం) చుట్టే తిరుగుతున్నాయి. BRSహయాంలో అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు దీని నిర్మాణానికి వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ప్రస్తుత MLA ప్రేమ్‌సాగర్ రావు ఆరోపిస్తున్నారు. తాను గెలిచాక ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిచేయించానని చెబుతున్నారు. దీనికి రూ.11కోట్ల వరకు ఖర్చుచేస్తే అవినీతి జరగలేదా అని దివాకర్‌రావు విమర్శిస్తున్నారు.