News February 14, 2026
మెదక్: తల్లీ,కొడుకుల విజయం

మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తల్లీ,కొడుకులు విజయం సాధించి సంచలనం సృష్టించారు. 14వ వార్డు నుంచి దొంతి లక్ష్మి, 15వ వార్డు నుంచి దొంతి నరేశ్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారు సమీప ప్రత్యర్ధులపై విజయం సాధించారు. వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
Similar News
News March 17, 2026
MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.
News March 17, 2026
తాడేపల్లిగూడెం: ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్

తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మున్సిపల్ సర్వేయర్, ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తూ రామకృష్ణ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్, సిబ్బంది, కుటుంబీకులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News March 17, 2026
ఓడ నుంచి సిలిండర్లలోకి LPG.. ప్రాసెస్ ఇదే!

‘నందాదేవి’ షిప్ INDకు <<19406038>>చేరుకుంది<<>>. పైపుల ద్వారా గ్యాస్‌ను పంపించేందుకు దానిని -40°Cకు చల్లబరుస్తారు. ఓడరేవుకు షిప్ రాగానే దానికి పైపులను అటాచ్ చేసి ప్రెజర్ పంపుల ద్వారా ద్రవ రూపంలో ఉన్న గ్యాస్‌ను తీరంలోని స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ వడపోసిన తర్వాత గ్యాస్ లీక్ అయితే గుర్తుపట్టడానికి ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఆ తర్వాత ఖాళీ సిలిండర్లలో సరైన పరిమాణంలో గ్యాస్ నింపి సీల్ వేస్తారు.


