News February 4, 2025
మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.
Similar News
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.
News December 13, 2025
రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


