News February 4, 2025
మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.
Similar News
News February 13, 2025
93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్: మంత్రి

TG: టీ ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో 93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ అందిస్తామన్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశంలో ఆయన దీని గురించి వివరించారు. ఇప్పటికే రంగారెడ్డి(D) హాజిపల్లి, నారాయణపేట-మద్దూరు, సంగారెడ్డి-సంగుపేట, పెద్దపల్లి(D) అడవి శ్రీరాంపూర్‌లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
News February 13, 2025
భద్రాద్రి: బైక్, లారీ ఢీ.. ఒకరు మృతి

ఇసుక లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గోగుబాక వద్ద జరిగింది. స్థానికుల వివరాలిలా.. దుమ్ముగూడెం మండలం జడ్ వీరభద్రవరం గ్రామానికి చెందిన కొమరం రాంబాబు బైక్‌పై వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
News February 13, 2025
PMAY ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

AP: PMAY 1.0ను కేంద్రం 2027 వరకు పొడిగించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. PMAY 2.0 సర్వే కొనసాగుతోందని, ఇప్పటివరకు 11,600 మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. గతంలో TDP హయాంలో 3.18L మందిని ఎంపిక చేయగా, YCP ఆ జాబితాను మార్చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందన్నారు. అప్పుడు మిగిలిపోయిన వారికి 2024 ఏప్రిల్ తర్వాత ఇళ్లు మంజూరయ్యాయని, మరో 4.5L ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.