News November 11, 2024
మెదక్: దహన సంస్కారాలలో అడుక్కోడానికి స్కానర్

డిజిటల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో దహన సంస్కారాల సమయంలో అడుక్కోవడానికి స్కానర్ ఉపయోగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన బాలమణి నిన్న మృతిచెందగా ఈరోజు దహన సంస్కారం నిర్వహించారు. దహన సంస్కారాల వద్ద అడుక్కోవడానికి వచ్చిన కాటిపాపల మహేశ్ ఏకంగా షర్టుకు ఫోన్ పే స్కానర్ తగిలించి అడుక్కోవడం వింతగా చూశారు.
Similar News
News April 12, 2026
MDK: సాసర్ పిట్స్‌తో దాహం తీర్చుతున్న అటవీ శాఖ

మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతతో అడవుల్లో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘సాసర్ పిట్స్’ (సిమెంట్ కుంటలు) జంతువులకు ప్రాణాధారంగా మారాయి. కెమెరా ట్రాప్‌లలో చిరుతలు, జింకలు నీరు తాగుతున్న దృశ్యాలు నమోదవుతున్నాయి. ఈ కుంటలు జంతువులు గ్రామాల వైపు రాకుండా అడ్డుకుంటూ రక్షణ కల్పిస్తున్నాయి. అధికారులు నిరంతరం నీరు నింపుతూ పర్యవేక్షిస్తున్నారు.
News April 12, 2026
మెదక్: ప్రజావాణి కార్యక్రమం వాయిదా: కలెక్టర్

ఈ నెల 13న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల పనుల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో కలెక్టరేట్, మున్సిపాలిటీలు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.