News March 24, 2024
మెదక్: దారుణ హత్య చేసిన దొంగ బాబా
పూజలు చేస్తానని నమ్మించి ఓ మహిళను హత్య చేసిన దొంగ బాబా నర్సింగ్ రామ్ అలియాస్ శివను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తానని నమ్మించి ఘట్‌కేసర్ పరిధిలోని మాదారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారు గొలుసు కోసం బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. శివపై పలు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.
Similar News
News September 15, 2024
ప్రైవేట్ టీచర్ల పట్ల సీఎం రేవంత్ తీరు సరిగాదు: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోనీ పోలీస్ కన్వెన్షన్ హల్‌లో ట్రస్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కేవలం ప్రభుత్వ టీచర్లను మాత్రమే సన్మానించిందని ఆరోపించారు. గురువులంత సమానమేనని, ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని సూచించారు.
News September 14, 2024
బేస్ బాల్ క్రీడల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా జట్టు
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 5వ తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా జట్టు దూసుకుపోతున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మ రంగారెడ్డి, మధు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జట్టుపై 1:7 తేడాతో, మేడ్చల్ జట్టుపై 1:3 తేడాతో సిద్దిపేట జట్టు గెలుపొంది ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నట్లు వివరించారు.
News September 14, 2024
అలజడి సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయండి: మంత్రి పొన్నం
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గవిభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్, సీపీతో కలిసి మాట్లాడారు.