News November 30, 2024
మెదక్: దీక్షా-దివస్లో కనిపించని KCR!

దీక్షా-దివస్ను BRS శ్రేణులు సక్సెస్ చేశాయి. సోషల్ మీడియాలో KCR పోరాటానికి ఎలివేషన్స్ జత చేస్తూ ఆకాశానికి ఎత్తాయి. BRS MLAలు ర్యాలీలు తీసి KCR చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ నలుమూలల నాయకులు తెలంగాణ భవన్కు క్యూకట్టారు. కానీ, KCR మాత్రం బయటకురాలేదు. ఉద్యమంలో అంతా తానై నడిచిన గులాబీ బాస్ నిన్నటి దీక్షా-దివస్లో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకపోవడం గమనార్హం.
Similar News
News December 1, 2025
మెదక్: ఈరోజే మంచి రోజు.. అత్యధిక నామినేషన్లు

మెదక్ జిల్లాలో ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మెదక్, తూప్రాన్ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు ఏకాదశి, మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో ద్వాదశి కారణంగా నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈరోజే అధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.
News December 1, 2025
మెదక్: ఏకగ్రీవం దిశగా మల్కాపూర్ తండా పంచాయతీ

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్ గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ ఉండగా ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.
News December 1, 2025
MDK: తహశీల్దార్ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలు, మైక్లకు తహశీల్దార్ అనుమతి తప్పనిసరన్నారు. పోలింగ్కు 44 గంటల ముందు సభలు, ఊరేగింపులు నిషేధమని, లౌడ్స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమేన్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఒక్క వాహనం అనుమతి ఉందన్నారు.


