News February 9, 2025

మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

image

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.

Similar News

News February 8, 2026

MDK: మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 8, 2026

నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తనిఖీ

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఫెసిలిటేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News February 7, 2026

మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.