News November 23, 2024
మెదక్: నర్సింగ్ కళాశాల మంజూరుకు ఉత్తర్వులు జారీ
మెదక్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల స్థాపనకు వైద్య శాఖ పరిపాలన మంజూరు చేసింది. సివిల్ వర్క్స్ నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణకు ఒక్కో కళాశాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తూ TOMSIDCకి అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 11, 2024
మెదక్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీధర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నాడు. అదే విధంగా దుబ్బాక పరిధిలోని ధర్మాజీపేట వాడకు చెందిన నర్సింలు(42) అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్నూర మండలం నస్తీపూర్‌కి చెందిన కుమార్‌పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూసైడ్ చేసుకున్నాడు.
News December 11, 2024
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరు
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరి తేదీ అని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ శోభారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రములో సంప్రదించాలని సూచించారు.
News December 11, 2024
సిద్దిపేట: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్
గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 37 కేంద్రాల్లో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.