News July 21, 2024
మెదక్: నవోదయ నోటిఫికేషన్ విడుదల

నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైందిన సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 6, 2026
మెదక్: పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పన: కలెక్టర్

పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 6, 2026
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా దృష్టి పెట్టామన్నారు.
News January 6, 2026
మెదక్: గుప్త నిధుల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

గుప్త నిధులు తీస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా.. కాట్రియాలలో గుప్త నిధుల పేరుతో మోసానికి పాల్పడిన సిరిసిల్లకు చెందిన కందకంచి రాజారాం, కందకంచి రాజేష్, అశోక్‌లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.


