News July 21, 2024
మెదక్: నవోదయ నోటిఫికేషన్ విడుదల

నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైందిన సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 14, 2025
17న ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ మహిళలు, పురుషులు, 19 సంవత్సరాల లోపు బాల, బాలికలు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 17న మెదక్ గుల్షన్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ కె.ప్రభు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు మెదక్ బస్ డిపో వద్ద గల గుల్షన్ క్లబ్‌లో ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94404 90622 సంప్రదించాలన్నారు.
News November 14, 2025
మెదక్: ‘టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి’

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించాలని
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును జిల్లా PRTU TS అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు.
News November 14, 2025
పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.


