News December 29, 2024

మెదక్: ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’

image

మెదక్ మం. జానకంపల్లికి చెందిన మల్లయ్య కుమార్తె శ్రావణి(17) మెదక్ కస్తూర్బా పాఠశాలలో టెన్త్ చదువుతుంది. ఈనెల 22న బోనాల పండుగకు ఇంటికొచ్చిన శ్రావణి శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’ అని లేటర్ రాసి ఉరేసుకుంది. తన చెల్లి మృతికి కారణమైన తండ్రి మల్లయ్య, పినతల్లిపై చర్యలు తీసుకోవాలని స్రవంతి, ఆకృతి ఫిర్యాదు చేశారు. మల్లయ్య మొదటి భార్య చనిపోగా జ్యోతిని 2వ పెళ్లి చేసుకున్నాడు.

Similar News

News November 22, 2025

మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

image

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.