News February 27, 2026
మెదక్: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సెల్‌ఫొన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు శిక్షణకు అర్హులని, ఆసక్తి గల వారు 94901 03390, 94901 29839 నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 19, 2026
59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.
News April 19, 2026
ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.
News April 19, 2026
నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!

గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోంది. సదరు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.


