News February 27, 2026

మెదక్: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం

image

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సెల్‌ఫొన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు శిక్షణకు అర్హులని, ఆసక్తి గల వారు 94901 03390, 94901 29839 నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News April 15, 2026

HNK: ఓఆర్‌ఆర్‌పై యాక్సిడెంట్.. తండ్రీకొడుకుల మృతి

image

ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో HNK జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. HYD పెద్ద అంబర్‌పేట్-బొంగులూరు మార్గంలో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్ రెడ్డి (37) కారు అదుపుతప్పి ముందున్న నీటి ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వేద ప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన ఆయన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

News April 15, 2026

డీలిమిటేషన్ బిల్లు.. NDAకు మెజార్టీ ఉందా?

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల రాజ్యాంగ సవరణల ఆమోదానికి లోక్‌సభలో 364మంది సభ్యుల మద్దతు అవసరం. NDAకు 293మంది MPలు ఉన్నారు. దీంతో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి BJP యత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక NDA పార్టీలన్నీ తమ MPలకు విప్ జారీ చేశాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఆయా పార్టీల మహిళా నేతలను LS గ్యాలరీకి రప్పిస్తున్నారు.

News April 15, 2026

BSNLలో 120 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/ CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు రేపటి నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.