News February 27, 2026

మెదక్: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం

image

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సెల్‌ఫొన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు శిక్షణకు అర్హులని, ఆసక్తి గల వారు 94901 03390, 94901 29839 నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News April 18, 2026

కర్నూలు: 10కి చేరిన మృతుల సంఖ్య

image

మంత్రాలయం(M) చిలకలడోణ గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగిన రోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక, బెల్లి, యశోద, పుట్టమ్మ, లాలాక్షి, మీనాక్షి, సునీల్, కుమార్ మృతిచెందారు. కర్నూలు GGHలో చికిత్స పొందుతూ తేజస్విని శుక్రవారం మృతి చెందింది. నేడు శోభ అనే మహిళ మరణించింది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.