News March 1, 2025
మెదక్: నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: SP

మార్చి 1 నుంచి 31 వరకు మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 1, 2025
మెదక్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గురుకుల పాఠశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న కిషోర్ తన కూతురిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. శివరాత్రి పండుగకు వచ్చిన విద్యార్థి తిరిగి వెళ్లేందుకు ఇష్టం లేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 1, 2025
ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.50 లక్షలు

మహా శివరాత్రి సందర్బంగా జరిగిన ఏడుపాయల మహా జాతర ఆదాయం (16 రోజులు) రూ.61.50 లక్షలు వచ్చింది. శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆదాయం ఒడిబియ్యం 53,950, కేశఖండనంకు 68,150, స్పెషల్ దర్శనానికి రూ.9,00,800, లడ్డూ రూ. 18,74,580, పులిహోర రూ.7,96,480, హుండీ రూ.24,56,277 మొత్తం రూ.61,50,237 వచ్చిందన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.32,051 అదనంగా ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.
News March 1, 2025
ఈనెల 4న సంగారెడ్డిలో సృజన టెక్ ఫెస్ట్

సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పి. జానకి దేవి శనివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ టెక్ ఫెస్టులో పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.