News December 14, 2024
మెదక్: నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు
News February 26, 2026
మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.
News February 26, 2026
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.


