News August 19, 2024
మెదక్: నేడు రక్షాబంధన్ వేడుకలు

జీవితంలో ఎన్ని బంధాలున్నా సోదరీ, సోదరుల అనుబంధం అపురూపమైనది. చెల్లె ఆపదలో ఉంటే అన్న ముందుంటాడు. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. ఇరువురి మధ్య ఉన్న అపురూపమైన బంధాన్ని పండగల చేసుకునే రోజే రక్షాబంధన్ (రాఖీ పండుగ). కృతయుగం నుంచి చేసుకుంటున్న రక్షాబంధన్ పండుగను రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ అంటారు. ఈ రోజే జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి చేసుకుంటారు.
Similar News
News November 23, 2025
మెదక్: రిజర్వేషన్ కోసం ఎదురు చూపులు?

మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 492 పంచాయతీలుండగా 4,220 వార్డులు, మొత్తం ఓటర్లు 5,23,327 ఉన్నారు. ఇందులో మహిళలు 2,71,787, పురుషులు 2,51,532 ఇతరులు 8 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు నడుస్తోంది. తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 23, 2025
మెదక్: నేడు NMMS పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
News November 23, 2025
మెదక్లో JOBS.. APPLY NOW

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్లో సమర్పించాలని తెలిపారు.


