News February 23, 2025
మెదక్: నేడే గురుకుల పరీక్ష

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 23, 2025
విద్యుత్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక

విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
News February 23, 2025
మెదక్: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.