News October 5, 2024
మెదక్: పక్కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన: అదనపు కలెక్టర్

డిఎస్సీ 2024లో అర్హత సాధించిన 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డీఎస్సీ 2024లో 704 ఎంపికయ్యారని 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతుండగా గురువారం సందర్శించారు. మొత్తం 704 మంది అభ్యర్థులకుగాను 618 మంది అభ్యర్థులు వచ్చారు.
Similar News
News December 24, 2025
మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


