News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.
Similar News
News December 15, 2025
శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.


