News March 12, 2025
మెదక్: పనులు సక్రమంగా జరిగేలా చూడాలి: కలెక్టర్

రిజిస్ట్రేషన్, ధరణి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. కౌడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్, రిజిస్ట్రేషన్ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, ధరణి పనితీరును పరిశీలించారు. సర్వర్ ఎలా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 14, 2025
మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.
News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.
News March 14, 2025
ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.