News August 10, 2024
మెదక్: పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనం ఇస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 జీపీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2024తో జీపీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ఆ రోజు నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కార్యదర్శులపై అదనపు భారం పడుతోంది.
Similar News
News December 5, 2025
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజును దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు.
News December 5, 2025
మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.
News December 5, 2025
మెదక్: రైతుల కష్టాలపై విద్యార్థుల ప్రదర్శన అదుర్స్

మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు. టీచర్ అశోక్ దేవాజీ మార్గదర్శకత్వంలో దీన్ని రూపొందించారు.


