News March 29, 2024

మెదక్ పార్లమెంట్‌లో యువతే కీలకం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే ఆయా పార్టీలకు కీలకంగా మారనున్నాయి. మెదక్ లోకసభ స్థానంలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, అందులో 39 ఏళ్ల లోపు వారే 9, 52,583 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 53,458 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఏప్రిల్ 15 వరకు నూతన ఓటర్లు నమోదు చేసుకునే వెసులుబాటును ఎలక్షన్ కమీషన్ ఇవ్వడంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Similar News

News October 6, 2024

MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.

News October 6, 2024

సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

News October 6, 2024

దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం

image

కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.