News June 7, 2024

మెదక్: పిడుగుపడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత

image

పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా రాజ్ పల్లిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మార్గం సిద్దిరాములు(55) కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులు చేయడానికి వెళ్లారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షంతోపాటు పిడుగు పడింది. సిద్దిరాములు మృతిచెందగా భార్య రాధమ్మ, మరో మహిళా మౌనిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 29, 2024

REWIND: మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కేసీఆర్

image

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 నవంబర్ 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.

News November 29, 2024

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో వణికిస్తోన్న చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాను తీవ్ర చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం అత్యల్పంగా మెదక్ జిల్లా శివంపేటలో 8.9డిగ్రీలు నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా నల్లవెళ్లిలో 9.2, సిద్దిపేట జిల్లా కొండపాక 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 9 గం. దాటినా తగ్గడం లేదు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 28, 2024

సిద్దిపేట: గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కమిటీ: మంత్రి పొన్నం

image

తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను మంత్రి తనిఖీ చేసి మాట్లాడారు. గురుకులాలు, హాస్టళ్లలో గతం కంటే మెరుగైన వసతులున్నాయని చెప్పారు. గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామని చెప్పారు.