News February 16, 2026

మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

image

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 17, 2026

మెదక్: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన సారా జైపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

News March 17, 2026

RMPT: ఖేలో ఇండియా ఉషు లీగ్‌లో గోల్డ్ మెడల్

image

నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో రామాయంపేటకు చెందిన జమాల్‌పూర్ హీనా మాధురి గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం ప్రతినిధులు, కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. తన ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులు సుశీల-మల్లేశంకు మాధురి కృతజ్ఞతలు తెలిపారు.

News March 16, 2026

అంగన్‌వాడీల అరెస్టులు దుర్మార్గం: సీఐటీయూ

image

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్రమ అరెస్టులకు పాల్పడటంపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మండిపడ్డారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీలను దారిలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికగా సమస్యలపై చర్చించి, వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అణచివేయడం సరికాదన్నారు.