News January 31, 2025
మెదక్: పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్- ఏఆర్ కానిస్టేబుల్‌కు గోల్డ్ మెడల్

మెదక్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ కరీంనగర్లో జరుగుతున్న 3వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని, సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ అభినందించారు.
Similar News
News November 21, 2025
నర్సాపూర్: ‘కుల బహిష్కరణపై ఫిర్యాదు.. పట్టించుకోని ఎస్ఐ’

నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలో అమ్మవారి గుడి నిర్మాణానికి పెద్దలు నిర్ణయించారు. అయితే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గోపురం నీడ ఇళ్లపై పడకుండా కొద్ది దూరంలో నిర్మించాలని బాధితుడు చెప్పినందుకు పంచాయతీ పెట్టి, పరువు తీసి,కులబహిష్కరణ చేశారు. పొలంలో వరి కొయ్యనీవకుండా అడ్డుపడ్డారు. నర్సాపూర్ SI, SPకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
News November 21, 2025
మెదక్: డీఈవోగా విజయ బాధ్యతలు

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ.విజయ శుక్రవారం బాధ్యతలు చేయట్టారు. ఏడీగా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. SCERT ప్రొఫెసర్ డి.రాధా కిషన్ ఇన్ఛార్జ్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్‌గా గత 22 నెలలుగా పనిచేసి ఈనెల 11 నుంచి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇచ్చారు.
News November 21, 2025
ఉమ్మడి జిల్లాను వణికిస్తోన్న చలి

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ 9.9, ఝరాసంగం10.6, మెదక్ జిల్లా శివంంపేట11.2, పెద్దశంకరంపేట 12.0, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 11.6, కొండపాకలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


