News June 6, 2024
మెదక్: పోస్టల్ బ్యాలెట్‌లోనూ.. నోటాకు ఓటు

మెదక్ ఎంపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు 35 ఓట్లు పడ్డాయి. పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో 1,316 ఓట్లు రాగా, గజ్వేల్ 728, మెదక్ 452, సిద్దిపేట 648, దుబ్బాక 590, నర్సాపూర్ 397, సంగారెడ్డి 451ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 44మంది పోటీలో ఉండగా 41మంది డిపాజిట్ కోల్పోయారు. BJP, INC, BRSకు కలిపి మొత్తం 13,00,085 ఓట్లు, గుర్తింపు పొందిన పార్టీలకు 48,040, స్వతంత్రులకు 33,497 ఓట్లు వచ్చాయి.
Similar News
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.
News December 3, 2025
మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
News December 3, 2025
మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు


