News July 21, 2024

మెదక్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకొనే విధంగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని సిబ్బందన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 57888, డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామన్నారు.

Similar News

News December 9, 2025

మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

image

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 9, 2025

మెదక్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు.. 39 తీర్మానాలు ఆమోదం

image

మెదక్ పట్టణంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశపెట్టిన 39 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

మెదక్: సర్పంచ్ బరిలో జర్నలిస్టులు

image

పంచాయతీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాము గెలుపొంది ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. మెదక్ జిల్లాలో మక్తభూపతిపూర్ (సిహెచ్. అశోక్), బూర్గుపల్లి (సాయిలు), కల్వకుంట (రంగా రాజకిషన్), చంద్లాపూర్ (కృష్ణాగౌడ్), చందంపేట (నాయిని ప్రవీణ్), పొడ్చన్‌పల్లి(భూమయ్య)ల్లో జర్నలిస్టులు సర్పంచ్ బరిలో నిలిచారు.