News November 17, 2024
మెదక్: ప్రజాపాలన విజయోత్సవాలు వాయిదా: కలెక్టర్
మెదక్ పట్టణంలో సోమవారం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలు-2024 అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రాత్రి 10 గంటలకు తెలిపారు. తదుపరి కార్యక్రమాల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముందుగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
నారాయణఖేడ్: రెండు తలల దూడ జననం
నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతుకు చెందిన గేదె రెండు తల దూడకు జన్మనిచ్చింది. అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డికి చెందిన ఇదే ఆదివారం ఈనింది. ఈతలో రెండు తలలతో కూడిన దూడను జన్మనిచ్చింది. తలభాగం రెండు తలలుగా, వెనక భాగం ఒకే దగ్గర ఆతుక్కొని జన్మించింది. దూడ గంట పాటు బతికే ఉన్న తర్వాత మృతి చెందినట్లు సాయిరెడ్డి తెలిపారు.
News November 18, 2024
ఇందిరా గాంధీ ప్రతిభా పురస్కారానికి జోగిపేట మహిళ ఎంపిక
ఇందిరా గాంధీ ప్రతిభా పురస్కారం అవార్డుకు జోగిపేటకు చెందిన దీపికా రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. తనను ఇందిరా గాంధీ ప్రతిభ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి దీపికా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News November 18, 2024
‘సర్వే ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదు’
సర్వే చేస్తున్న ఉపాధ్యాయులను కొందరు అధికారులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు, స్వేచ్ఛనివ్వాలని పిఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు ఎల్.మల్లారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వేలో ఉపాధ్యాయులు ఎంతో ప్రయాస పడి ఒకవైపు పాఠశాలను, మరొక పక్క సర్వేను సమర్థ వంతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో సమన్వయంగా పని చేయించుకోవాలని సూచించారు.