News March 10, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం ఆదేశించారు.
Similar News
News March 23, 2025
MDK: సీఎం బర్త్‌డే విషెస్.. ఎంపీ రిప్లై

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో, రాష్ట్ర ప్రజాపాలనలో భాగస్వాములు కావడానికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఎంపీ ట్విట్టర్ (X) ద్వారా స్పందిస్తూ.. సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల(50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2025
మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. భర్త భూపతి బంధువుల ఇంట్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.