News December 3, 2024

మెదక్: ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొన్నం

image

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సంస్కరణలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు ఉన్న పరిమితి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడమన్నారు.

Similar News

News January 16, 2025

మెదక్: సర్వేను పక్కగా నిర్వహించాలి: కలెక్టర్

image

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

News January 16, 2025

3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

News January 16, 2025

గజ్వేల్: అనాథలైన ముగ్గురు పిల్లలు

image

సిద్దిపేట జిల్లా బంగ్లావెంకటాపూర్ గ్రామంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దర్శనం నర్సింలు-నాగమణి దంపతులకు ముగ్గురు కొడుకులు. నర్సింలు మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుండగా.. ఆయన భార్య ఈ నెల 5న కిడ్నీ వ్యాధితో చనిపోయింది. దీంతో వారి పిల్లలు రాజేందర్(7), హరికృష్ణ(5), చందు(3) అనాథలుగా మారారు. వీరికి వృద్దురాలైన అమ్మమ్మ మాత్రమే తోడుగా ఉంది. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.