News October 23, 2024

మెదక్: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: హరీశ్‌రావు

image

మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్‌ షాక్‌ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News November 8, 2024

కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి: హ‌రీశ్‌రావు

image

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగ‌జారి మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. సుమ‌తీ శ‌త‌కానికి సంబంధించిన పద్యాన్ని హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. 

News November 8, 2024

సమయానికి బస్సులు నడపాలి: ఆర్ఎం

image

ప్రయాణికుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని మెదక్ రీజినల్ మేనేజర్ ప్రభు లత అన్నారు. శుక్రవారం ఖేడ్ ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి తనిఖీ చేశారు. డిపో మేనేజర్ మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్ నరసింహులతో సమావేశమై డిపో ఆదాయం వివరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 13న అరుణాచలం ప్రత్యేక సూపర్ డీలక్స్ బస్సులు నడపాలని DMకు సూచించారు. ఇందులో ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News November 8, 2024

ప్రజల మద్దతుంటే అరెస్టులెందుకు..?: హరీశ్ రావు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.