News April 11, 2024

మెదక్: ప్రవేశాలకు మరో రెండు రోజులే గడువు 

image

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12తో దరఖాస్తు గడువు ముగుస్తుందని మెదక్ ఆర్సీఓ ప్రభాకర్ అన్నారు. అర్హులైన బాలబాలికలు mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 28న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 23, 2025

RMPT: అజంతా ఎక్స్ ప్రెస్‌లో సాంకేతిక లోపం

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో రెండు గంటలుగా రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్తున్న అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ సాంకేతిక లోపం రావడంతో నిలిపివేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైలుకు వేరే ఇంజను బిగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

News October 22, 2025

MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

image

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.

News October 22, 2025

మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.