News April 11, 2024

మెదక్: ప్రవేశాలకు మరో రెండు రోజులే గడువు 

image

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12తో దరఖాస్తు గడువు ముగుస్తుందని మెదక్ ఆర్సీఓ ప్రభాకర్ అన్నారు. అర్హులైన బాలబాలికలు mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 28న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Similar News

News March 20, 2025

మెదక్: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

మెదక్ జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.

News March 20, 2025

సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

image

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2025

మెదక్: SSC పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: SP

image

21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!