News April 7, 2025

మెదక్: ప్రేమ వివాహం వద్దనందుకు యువతి ఆత్మహత్య

image

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాలు.. కామారెడ్డి జిల్లా భగీరథపల్లికి చెందిన వరలక్ష్మి(18) కొద్దిరోజులుగా చేగుంట(M) బోనాలలోని సోదరితో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వరలక్ష్మి ప్రేమలో పడింది. ఈ విషయంలో వరుస కాదని తల్లిదండ్రులు మందలించడంతో 4న విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News November 28, 2025

వనపర్తిలో 87 పంచాయతీలకు 232 నామినేషన్లు

image

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు రెండు రోజుల్లో మొత్తం 232 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 157 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మండలాల వారీగా (శుక్రవారం):
పెద్దమందడి: 63
ఘనపూర్: 53
రేవల్లి: 19
గోపాల్‌పేట: 14
ఏదుల: 08

News November 28, 2025

మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News November 28, 2025

కొమురం భీం జిల్లా SC-ST టీచర్స్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక

image

ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ కొమురం భీం జిల్లా శాఖ 2026-28 పదవీకాలానికి ఎన్నికలు రెబ్బెన జడ్పీహెచ్‌ఎస్‌లో రాష్ట్ర సలహాదారు జాడి కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా దుర్గం తులసిరామ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి రాజేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు, రిజర్వేషన్ల అమలు, అంబేడ్కర్ భావాల సాధనకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.