News September 24, 2024
మెదక్: ఫుట్ బాల్ జట్ల ఎంపిక

ఫుట్బాల్ జట్ల ఎంపికను మెదక్ వెస్లీ గ్రౌండ్ లో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ గంగాల ఆధ్వర్యంలో రామాయంపేట పిడి నాగరాజు, ఎంబి పూర్ పీడి రూపేందర్ ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, వినోద్ కుమార్, సుజాత కుమారి పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట క్రీడాకారులు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
News December 9, 2025
మెదక్: నేడు 5 గంటల వరకే ప్రచారం: కలెక్టర్

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు వెళ్లాలన్నారు.