News April 5, 2025

మెదక్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలని వేధించిన వ్యక్తిపై మెదక్ రూరల్ PSలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మెదక్ మండలానికి చెందిన విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో పదో తరగతి చివరి పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఖాజిపల్లికి చెందిన అనిల్ కుమార్ తనను ప్రేమించాలంటూ వేధించాడు. అమ్మాయి తల్లి దండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 6, 2025

మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

image

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 6, 2025

మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

image

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య(39) నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!