News April 24, 2024
మెదక్: బీఆర్ఎస్ డబుల్ హ్యాట్రిక్ కొట్టేనా?
రెండు దశాబ్దాలుగా మెదక్ ఎంపీ స్థానం బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. గులాబీ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్‌ఎస్ దూసుకుపోతూ ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్‌ఎస్ ముందుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన 2004 ఎన్నికల నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని BRS ఉవ్విళ్లూరుతోంది.
Similar News
News January 24, 2025
మెదక్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.
News January 24, 2025
ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
News January 24, 2025
మాసాయిపేట: భార్య దూరంగా ఉంటుందని ఆత్మహత్య
అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి గ్రామ శివారులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహ చారి ఈనెల 21న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భార్య గత కొంత కాలంగా దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఫిర్యాదు చేశారు.