News May 21, 2024

మెదక్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ జిల్లాలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను గిరిజన బాలబాలికల నుంచి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. 3, 5, 8వ తరగతులలో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12న కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతిన ఎంపిక నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Similar News

News November 28, 2024

మెదక్: ‘వ్యవసాయమంటే దండగ కాదు పండుగ’

image

వ్యవసాయమంటే దండగ కాదు పండుగని నిరూపించిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ సదస్సులో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. అయనా మాట్లాడుతూ.. “వరి వేస్తే ఉరి కాదు సిరి” అని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు. సాగుకు సాంకేతికత జోడించి రైతులకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News November 28, 2024

పాపన్నపేట: పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

image

పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన శాలను, మూత్రశాలలను పరిశీలించి ఉన్నత పాఠశాల HM దత్తు రెడ్డికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

News November 28, 2024

సిద్దిపేట: 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూత..?: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు ఉన్న విద్యార్థుల పాఠశాలలు 4,314, మొత్తం 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసేసే ప్రణాళికతో ఉన్నట్లున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.