News May 21, 2024
మెదక్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
మెదక్ జిల్లాలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను గిరిజన బాలబాలికల నుంచి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. 3, 5, 8వ తరగతులలో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12న కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతిన ఎంపిక నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Similar News
News December 9, 2024
REWIND: NIMSలో KCR దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
News December 9, 2024
KCR అసెంబ్లీకి వస్తారో రారో.. మీరే చూస్తారు: హరీశ్‌రావు
నేటి నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. BRS MLAలు, MLCలతో పార్టీ అధినేత KCR ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సమావేశమయ్యారు. గురుకులాల బాట ద్వారా అధ్యయనం చేసిన నివేదికను RS ప్రవీణ్‌కుమార్, BRSV విభాగం అందజేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై KCR ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
News December 8, 2024
గజ్వేల్: నేడు కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.