News March 9, 2025
మెదక్: భర్త మృతి.. మూడు రోజులకు భార్య మృతి

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందిన మూడు రోజులకే భార్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన చింతాకుల ఐలయ్య మూడు రోజుల క్రితం మరణించగామూడు రోజులకే ఇవాళ ఉదయం భార్య కొమురవ్వ అకస్మాత్తుగా మృతి చెందింది. భార్యాభర్తలు మూడు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో విషాదం నెలకొన్నది.
Similar News
News March 20, 2025
మెదక్: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

మెదక్ జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.
News March 20, 2025
సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
మెదక్: SSC పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: SP

21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.