News July 7, 2024

మెదక్: భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం

image

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌-మానక్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. 2024-25 సంవత్సరానికి ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 15లోగా వెబ్‌సైట్‌ పంపించాల్సి ఉంది.

Similar News

News December 12, 2024

మాజీ మంత్రులను అడ్డుకోవడం దుర్మార్గం: హరీశ్ రావు

image

వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళ ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు.

News December 12, 2024

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో జాగ్రత్త

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి చంపేస్తోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా నల్లవల్లి 9.7, కంగ్టీ 9.8, కోహిర్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 12, 2024

సంగారెడ్డి: ఉద్యోగుల వివరాలను సేకరించాలి: DEO

image

సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.