News June 23, 2024
మెదక్: మంత్రి కొండా సురేఖను కలిసిన జిల్లా నేతలు
తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ అభివృద్దికి నిధుల కేటాయింపు గురించి చర్చించారు. వారితో నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, ఎలక్షన్ రెడ్డి ఉన్నారు.
Similar News
News November 13, 2024
మెదక్: భార్య డెలివరీ.. యాక్సిడెంట్‌లో భర్త మృతి
మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూచారం గ్రామానికి చెందిన మజ్జతి విజయ్(30) మృతి చెందాడు. సోమవారం అతడి భార్య మౌనిక తూప్రాన్ ఆసుపత్రిలో ప్రసవమైంది. గ్రామానికి చెందిన బోయిని ప్రేమ్ చంద్‌తో కలిసి బైక్ పై వెళ్లి బిడ్డను తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొని విజయ్ మృతి చెందాడు. భార్య డెలివరీ అయి ఆసుపత్రిలో ఉండగా.. అదే ఆసుపత్రి మార్చురీకి భర్త మృతదేహం వెళ్లడం విషాదకరం.
News November 13, 2024
కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమన ప్రపంచానికి చాటిన గొప్ప కవి అని, కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
News November 13, 2024
KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS
మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.