News April 25, 2024

మెదక్: ‘మచ్చ లేకుండా కలెక్టర్‌గా పనిచేశా.. గెలిస్తే అభివృద్ధి చేస్తా’

image

మచ్చ లేకుండా ఉత్తమ కలెక్టర్‌గా పనిచేశానని BRS MP అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 2 సెట్ల నామినేషన్ వేశానని, రేపు మాజీ మంత్రి హరీష్ రావు, BRS అభిమానుల మధ్య రేపు మరో 2 సెట్లు దాఖలు చేస్తానని తెలిపారు. మంచి కలెక్టర్‌గా పని చేసిన నేను మరింత సేవ చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్నానని తనను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

Similar News

News July 11, 2025

MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

image

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.

News July 11, 2025

మెదక్: ఢిల్లీ నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్

image

ఢిల్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై జరిగిన నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2025

మెదక్: ఆపరేషన్ ముస్కాన్.. 8 కేసులు నమోదు: ఎస్పీ

image

ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల వద్ద పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.