News April 10, 2024

మెదక్: మరో 6 రోజులే గడువు

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

Similar News

News March 17, 2025

కరీంనగర్: ఇంటర్ పరీక్షల్లో 621 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పెపర్ 1 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 19,425 మంది విద్యార్థులకు గాను 18,804 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 621 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 17, 2025

KNR: హాట్ టాపిక్‌గా KTR, తీన్మార్ మల్లన్న భేటీ..!

image

KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

News March 17, 2025

ఈనెల 23న కరీంనగర్‌‌కు కేటీఆర్..!

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని BRS పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!