News March 5, 2025
మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన పూర్య 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీ(38)ని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News November 18, 2025
సూర్యాపేట: సన్న రకం ధాన్యం సాగుకు రైతుల మొగ్గు

వానాకాలం సీజన్‌లో సన్న రకం ధాన్యం సాగుపై రైతులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,85,273 ఎకరాలలో వరి సాగు జరిగింది. దానిలో దొడ్డు రకం ధాన్యం 59,679 ఎకరాలలో సాగు చేయగా, మిగిలిన అధిక విస్తీర్ణంలో సన్నాలనే రైతులు పండించారు. సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ₹7,491

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటా రూ.7,491 పలికింది. వేరుశనగ ధర రూ.6,879 వరకు, ఆముదాలు రూ.5,861 వరకు నమోదయ్యాయి. అయితే, సీసీఐ (CCI) తేమ శాతం పేరుతో పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.