News March 5, 2025

మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన పూర్య 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీ(38)ని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News April 11, 2026

నెల్లూరు కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు మరోసారి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలని సీఎం ఇతర కలెక్టర్లకు సూచించారు.

News April 11, 2026

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.

News April 11, 2026

పోలీస్ సిబ్బంది ఫిర్యాదుకు ప్రత్యేక నంబర్: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ వకుల్ జిందాల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “ఎస్పీ సంపర్క్” పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కానిస్టేబులరీ స్థాయి సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 8688831470 నంబర్ ద్వారా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.