News March 5, 2025

మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News March 23, 2025

మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

image

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

మెదక్: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: ఎస్పీ

image

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి క్రైమ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలన్నారు.

News March 22, 2025

మెదక్: ఫారెస్ట్‌లో బ్రిడ్జి కండిషన్ పరిశీలించిన కలెక్టర్

image

మెదక్- సిద్దిపేట్ నేషనల్ హైవేలో తొనిగండ్ల వద్ద ఫారెస్ట్‌లో బ్రిడ్జి కండిషన్ కలెక్టర్ రాహుల్ రాజ్పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని ఆధికారులు ఆదేశించిరు. కొత్తగా నిర్మించే బ్రిడ్జ్‌కు త్వరగా అన్నీ అనుమతులు తీసుకుని వేగంగా వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలన్నారు.

error: Content is protected !!